సారీ అంటున్న సాయిపల్లవి..

హీరోయిన్‌ సాయిపల్లవి టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది..తాజాగా ఈ అమ్మడు హీరో నాగశౌర్య సరసన ‘కణం’ సినిమాలో నటించింది. ఈ సినిమాను ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.అయితే ఈ మధ్య నాగశౌర్య ఓ సందర్భంలో మాట్లాడుతూ ..సాయిపల్లవికి తలబిరుసు ఎక్కువనీ, ఆమె వలన షూటింగులో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు.

Sai Pallavi finally responds to Naga Shaurya

అయితే ఈ విషయాన్ని గురించి తాజాగా సాయిపల్లవి స్పందించింది. సెట్‌లో మా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే విషయం నాకే తెలియదు.    సినిమా అంటే నాకు పిచ్చి. సెట్‌లోకి వెళ్లానంటే ఎప్పుడూ అదే ధ్యాస. ఇంటికి వెళ్లాక మళ్లీ నాలాగా నేను మారిపోతుంటా.ఒక సన్నివేశం చెప్పారంటే దాన్ని పదిరకాలుగా చేసి, ఎలా బాగుంటుందో దర్శకుడిని అడిగి తెలుసుకొని కెమెరా ముందుకెళుతుంటా.బహుశా ఆ ధ్యాసలో ఉన్నప్పుడే నేను నాగశౌర్యతో మాట్లాడకుండా బాధపెట్టానో ఏమో తెలియదు. నాగశౌర్య చాలా సైలెంట్‌ పర్సన్‌. కెమెరా ముందుకొచ్చినప్పుడు ఆయనలో ఓ కొత్త మనిషి కనిపిస్తాడు. పరిణతితో నటిస్తుంటాడు. ఎక్కడ ఎలాంటి హావభావాలు ప్రదర్శించాలో ఆయనకి బాగా తెలుసు.

Sai Pallavi finally responds to Naga Shaurya

‘కణం’లో బాగా నటించాడు. తను నా గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది చూశా. వాస్తవానికి నేను ఎవర్నీ నొప్పించే రకం కాదు. ఒకవేళ నొప్పించినా… వెంటనే క్షమాపణలు చెబుతాను. ఇంటర్వ్యూలో చెప్పింది చూసిన వెంటనే నాగశౌర్యకి ఫోన్‌ చేయాలని ప్రయత్నించా.  కానీ తన దగ్గర ఫోన్‌ ఉండదని తెలిసింది. నిజంగా నాగశౌర్య మనసుని బాధపెట్టానో, లేదో తెలియదు కానీ… వ్యక్తిగతంగా మాత్రం ఈ విషయంలో చాలా బాధపడ్డాను. ఒక నటుడిగా తనపై చాలా గౌరవం ఉంది. సారీ చెప్పడానికి నేను సిద్ధంగా వున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.