You are here

సాయి పల్లవి… నిజంగా సింగిల్ పిసే!

ప్రేమమ్ మూవీతో యూత్‌ని ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి.. తాజాగా వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ‘ఫిదా’ చేసేసింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘ఫిదా’ మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తికాదు. మలయాళీ అయినప్పటికీ తెలుగు అందులోనూ తెలంగాణ యాసను నేర్చుకుని ‘బాద్మాష్ బొక్కలిరిగిపోయాయ్ బలిసిందారా’ అంటూ.. ఈ సింగిల్ పీస్ పిల్ల బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేస్తుంది. తెలుగులో తన మొదటి సినిమాతోనే అందరినీ ఫిదా చేసేసింది ఈ బ్యూటీ.

sai-pallavi-remunaration-doubled

ఫిదా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులని ఫిదా చేసిన సినిమా. ఈ సినిమాతో హీరో కి కూడా రాణి క్రేజ్ హీరోయిన్ సాయి పల్లవి కి వచ్చేసింది. భానుమతి క్యారెక్టర్ తో జనాల మనసుల్లో స్థానం పొందిన ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజీ పర్సన్ సాయి పల్లవి. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమె యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.

సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సాయి….పలు సినిమాల్లో మేకప్ లేకుంటే నటించారు. కాగా ఆమెను ఓ షాప్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారట. దీనికి పెద్ద మొత్తం ఆఫర్‌ చేశారట. అయితే కార్యక్రమంలో పాల్గొనడానికి సాయిపల్లవి నిరాకరించినట్లు సమాచారం. ఇలాంటివి తనకు నచ్చవని చెప్పారట. ఆసుపత్రుల ప్రారంభోత్సవాలు, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు వస్తానని చెప్పారట. తనకు సమయం దొరికితే ఇలాంటి కార్యక్రమాలకు ఉచితంగా వస్తానని సాయిపల్లవి చెప్పినట్లు తెలుస్తోంది.

Related Articles