అక్కినేని కోడలు అలా అందేంటి..!

అక్కినేని వారి ఇంటి కోడలు అయిన సమంత ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో తన పేరును అక్కినేని సమంత అని అధికారికంగా మార్చేసుకుంది. వారం క్రితమే పెళ్లి పీటలెక్కిన ఈ బ్యూటీ.. అప్పుడే తన సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటుంది. తన లేటెస్ట్ మూవీ రాజుగారి గది 2 చిత్రానికి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటోంది సమంత అక్కినేని. సామ్ పెళ్లి తర్వాత విడుదల అవుతున్న తొలి చిత్రంగా ఈ మూవీకి ఓ ప్రత్యేకత మిగిలిపోనుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన సమంత.. ‘అక్కినేనిగా నాపై బోలెడంత బాధ్యతను మోపినట్లుగా అనిపిస్తోంది. అందరి అంచనాలను నిలబెట్టుకుంటానని నాపై నాకు నమ్మకం. అక్కినేని వారింటిలో మహిళలను పురుషులతో సమానంగా చూడడం అనే విషయం తనకు ఎంతగానో నచ్చింది’ అని చెబుతూ.. తను చేసిన సినిమాలపై ఒక సెటైర్ వేసింది. ‘ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో అసలు ఎందుకు ఉన్నానో కూడా నాకు తెలియదు.. కాని రాజు గారి గది క్యారక్టర్ మాత్రం వేరు” అనేసింది.

Samantha After Marriage For Raju Gari Gadhi 2 Promotion

మరి ఈ బ్యూటీ ఇన్నాళ్ళూ చేసిన కొన్ని సినిమాలపై సెటైర్లు ఎంత వరకు కరెక్టో తెలీదు కానీ.. అలాంటి కొన్ని ఫ్లాపు సినిమాల్లో కూడా సమంత చేసిన గ్లామర్ రోల్ పాత్ర వలనే కదా ఆమెకు కమర్షియల్ హీరోయిన్ అనే సూపర్ స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమ్ వలనే ఈరోజు ఏ పాత్ర చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర హైప్ క్రియేట్ అవుతోంది. మరి సమంత అలాంటి పాత్రలపై సెటైర్ వేసేస్తే ఎలా? ఇండస్ర్టీలోకి వచ్చిన తొలిరోజునే కెపాసిటీ ప్రూవ్ చేసుకునే పాత్రలు రావుగా. అంటూ గుస గుసలాడుతున్నారు సిని వర్గాలు.