‘అమేజింగ్ మామ్’ అంటున్న సామ్‌..

టాలీవుడ్ బ్యూటీ సమంతకు దైవ చింతన ఎక్కువే. రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఒకవైపు సినిమాలను పూర్తి చేస్తూ..మరోవైపు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్న సమంత.. టైం దొరికితే చర్చిలను కూడా సందర్శించేస్తూ ఉంటుంది. గతంలో చెన్నైలో గడిపిన ఈ భామ.. ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

Samantha Akkineni Recalling Her Past Days

అయితే ఈ అమ్మడు రెగ్యులర్ గా వెళ్లేందుకు ఓ చర్చిని ఎంచుకోవాలి కదా.. అలా హైద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఉన్న ఆల్ సెయింట్స్ ను ఎంచుకున్న సామ్.. అక్కడకు వారానికి మూడు సార్లు వెళుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పిన సమంత.. అక్కడి మెట్లపై దిగిన ఓ ఫోటోను కూడా అభిమానులకు చూపించింది. అయితే.. ఇలా చర్చికి రావడంపై తనకు గతంలో ఉన్న చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ భామ.

తన తల్లి తనను బలవంతంగా చర్చికి లాక్కెళ్లిన నాటి రోజుల గురించి ప్రముఖ సినీ నటి సమంత అక్కినేని గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ప్రస్తావించారు. ‘మా అమ్మ నన్ను చర్చికి లాక్కెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయి. ప్రతి వారంలో బుధ, శని, ఆదివారం చర్చికి తీసుకెళ్లేది. నాకు, అస్సలు ఇష్టముండేది కాదు. అమ్మ బలవంతంతో వెళ్లేదాన్ని. కానీ, ఆమె ప్రార్థనలే నన్ను రక్షించాయి. మై అమేజింగ్ మామ్’ అంటూ ఆ ట్వీట్ లో సమంత చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ తో పాటు చర్చి వద్ద దిగిన తన ఫొటోను సమంత పోస్ట్ చేసింది.