పెళ్లైన తర్వాత.. : సమంత..

ఇప్పుడిప్పుడే భర్త తరఫు బంధువులంతా బాగా పరిచయం అవుతున్నారని, వరసలు అలవాటవుతున్నాయని తెలిపింది ప్రముఖ సినీ నటి సమంతా.

అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…పెళ్లైన తర్వాత వచ్చే సంక్రాంతిని చెన్నైలో ‘తలై పొంగల్’ అంటారని, ఈ పండగ తనకు ‘తలై పొంగల్’ అని చెప్పింది. అలాగే అక్కినేని ఇంటికి కొత్త కోడలిని, పెద్ద కోడలిని అని, తమ ఇంట్లో తలై పొంగల్ సందడి మొదలైందని చెప్పింది.

 samantha talk about her family

ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకుని కొత్తకాపురంలో అడుగుపెట్టడమే ఈ ఏడాది తన సంక్రాంతి స్పెషల్ అని, అందరం కలిసి ఉండటమే సంతోషంగా ఉంటుందని చెప్పింది. ప్రతి ఒక్కరి ముఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోందని తెలిపింది.