కటౌట్‌ని చూసి..మురిసిపోతోన్న శామ్‌…

ముసిముసినవ్వుల ముద్దుగుమ్మ సమంత సినిమాలలో ఏ రేంజ్‌ లో హీరోయిన్‌ గా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తాను సినిమాల్లో ఎంత యాక్టివ్‌ గా ఉంటుందో సోషల్‌ మీడియాలో కూడా అంతకంటే ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటుంది. తన ఒపీనియన్స్‌ని ఫ్యాన్స్‌ తో షేర్‌ చేసుకుంటుంది.

త్వరలో అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతున్నఈ అమ్మడు ఇప్పుడు తెగ సంబరపడిపోతోంది. ఎందుకో తెలుసా..? తన అన్నయ్య రానా కటౌట్‌ ని చూసి. అవును… ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో కూడా పంచుకుంది.

 samantha tweet for rana katoutu

రానా కథానాయకుడిగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ హోర్డింగ్‌కి రానా భారీ కటౌట్‌ ఏర్పాటుచేశారు. ఈ ఫొటోను సమంత ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అడిగడిగో నా సూపర్‌స్టార్‌ అన్నయ్య. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ అని ట్వీట్‌ చేసింది.

ఇంకేముందీ.. నెటజన్లు సమంత పెట్టిన ట్వీట్‌ కి భలేగా రియాక్ట్‌ అవుతున్నారు. ఈ ట్వీట్‌ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే 1000కి పైగా లైక్‌లు, వందకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’, ‘రాజు గారి గది 2’, ‘మహానటి’ చిత్రాల్లో నటిస్తోంది.