కత్తికి కౌంటరిచ్చిన సంపూ…

sampurneshbabu counter to katti mahesh

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే కత్తి మహేష్‌ చేసిన వాఖ్యలకు పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. కత్తిపై మాటల యుధ్దానికి దిగారు. అంతటితో ఆగకుండా తన కొడుకు కూడా గుర్తుపట్టేలేనంత క్రూరంగా చంపుతామంటూ మహేష్ కత్తికి వార్నింగ్‌ లు కూడా ఇచ్చారు పవన్ ఫ్యాన్స్‌.

ఇదే క్రమంలో ఫ్యాన్సే కాకుండా సినీరంగానికి చెందినవారు కూడా కత్తి మహేష్‌ని టార్గెట్‌ చేసి మాట్లాడారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు కూడా కత్తి మహేష్‌కి కౌంటరిచ్చాడు.

 sampurneshbabu counter to katti mahesh

వాక్ స్వాతంత్య్రం ఎవరికైనా ఉంటుంది .. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో .. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలన్నాడు సంపూ. ఒక విషయంపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు .. కానీ అలా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుందని, పవన్ కల్యాణ్ మంచి నటుడు కాకపోతే .. ఇన్ని కోట్ల మంది మనసులను గెలవడం ఎలా సాధ్యమని అడిగాడు. పవన్ విషయంలో మహేశ్ కత్తి అలా మాట్లాడి ఉండకూడదనీ, ఆయన ధోరణి తనకి చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు సంపూర్ణేష్.