You are here
సుపర్‌స్టార్‌ పుట్టినరోజే సినిమా టైటిల్‌గా.. టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

సుపర్‌స్టార్‌ పుట్టినరోజే సినిమా టైటిల్‌గా..

జ్యో స్టార్ ఎంటర్ ప్రైసెస్ పతాకం పై కబాలి సెల్వ దర్శకత్వంలో ఎం కోటేశ్వరరాజు నిర్మిస్తున్న చిత్రం 12-12-1950. సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన డైరెక్టర్ సెల్వ ఆయన పుట్టిన రోజు తారీఖు 12-12-1950 ను తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. ఈ చిత్రం నలుగురు రజినీకాంత్ వీరాభిమానులు కథ. ఇది ఒక కామెడీ ఎంటర్‌టైనర్. రమేష్ తిలక్, తంబీ రామయ్య , యోగి బాబు , ఎం ఎస్ భాస్కర్, జాన్ విజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ సెల్వ ఈ చిత్రం రజినీకాంత్ గారి కబాలి క్యారెక్టర్ చేస్తున్నారు.

Selva is making a film with Rajini's birth date as title

ఈ సందర్భంగా దర్శకుడు సెల్వ మాట్లాడుతూ “నేను రజినీకాంత్ వీరాభిమానిని, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగా రోజు. మేము అయన పుటిన రోజుని ప్రతిరోజు జరుపుకుంటాం . ఈ చిత్రం లోని హీరో రజినీకాంత్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో సినిమా చూస్తాడు అన్నది ముఖ్య కథ. ఈ చిత్రం షూటింగ్ పూర్తీ అయింది. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ లాంచ్ చేసాము. మా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో టీజర్ రిలీజ్ చేయబోతున్నాము. కామెడీ తో పాటు సినిమా చాల ఎమోషనల్ గ ఉంటుంది. ఆదిత్య – సూరియన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 72 శాతం కామెడీ 28 శాతం జి ఎస్ టి (గ్యాంగస్టర్, సెంటిమెంట్ మరియు థ్రిల్లర్ )”.

Selva is making a film with Rajini's birth date as title

నటీనటులు : కబాలి సెల్వ, తంబీ రామయ్య , షఫీ, రమేష్ తిలక్, ఆధవం, అజయ్ ప్రశాంత్, యోగి బాబు, ఎం ఎస్ భాస్కర్, ఢిల్లీ గణేష్, జాన్ విజయ్ ,డైరెక్టర్ : కబాలి సెల్వ ,మ్యూజిక్ : ఆదిత్య సూర్య ,ప్రొడ్యూసర్ : ఎం కోటేశ్వర రావు ,కెమెరా : విష్ణు శ్రీ ,ఎడిటింగ్ : దినేష్ పోంరాజ్ ,ఆర్ట్ : ఏ రాజేష్ ,స్టంట్ : దినేష్ కసి ,లిరిక్స్ : మతమిల్ ,కొరియోగ్రాఫర్ : అజర్ ,బ్యానర్ : జ్యో స్టార్ ఎంటర్ ప్రైసెస్ .

Related Articles