సురేష్ కృష్ణమూర్తి మృతికి బాలకృష్ణ సంతాపం..

ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే పాత్రికేయ సోదరుడు సురేష్ కృష్ణమూర్తితో నాకు మంచి అనుబంధం ఉంది, నన్ను ఎక్కువగా ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్ట్ ఆయనే. ఏ విషయాన్నైనా సూటిగా ప్రశ్నించేవాడాయన. అలాంటి మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకుండాపోవడం బాధాకరం. ప్రస్తుతం కుంభకోణంలో షూటింగ్‌లో ఉండడం వల్ల ఆయన్ను ఆఖరిసారిగా చూసే అవకాశం దక్కడం లేదని బాధపడుతూనే.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మానసికధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరుకుంటున్నాను అని నందమూరి బాలకృష్ణ తన సంతాపం తెలిపారు.

Senior Journalist Suresh Krishnamurthy Passes Away