ఒకేరోజు ఏడు సినిమాలు

Seven movies to clash this Friday
Seven movies to clash this Friday

తెలుగులో సెప్టెంబర్ 15న ఏడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ‘బాహుబలి’, భజరంగి భాయిజాన్‌ లాంటి సూపర్‌ హిట్ సినిమాలకు కథలందించిన చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్న ఈమూవీని సెప్టెంబర్‌ 15న విడుదల చేస్తున్నారు.

ఒకప్పుడు స్టార్ కమెడియన్‌‌గా ఉన్న సునీల్ హీరోగా మారాడు. ఇప్పుడు మరోసారి ఉంగరాల రాంబాబుతో మరోసారి కామెడి చేయడానికి అదే రోజున వస్తున్నాడు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారి ఆ తర్వాత  హీరోగా చాలా సినిమాలు చేశాడు.

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘ప్రాజెక్ట్ z’ కూడా 15న విడుదలౌతోంది. సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన ‘మాయావన్‌’ చిత్రాన్ని ‘ప్రాజెక్ట్ z’ గా రీమేక్ చేశారు.

నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం కథలో రాజకుమారి. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో రాజేష్‌ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఈ తేదినే వీడేవడు, సరసుడు మూవీలు విడుదల కానున్నాయి.