ఎక్కువ సార్లు శృంగారం మంచిదే!

Sex Benifits for Helath

శృంగారం ఓ మధురానుభూతి. జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైంది. దాంపత్య జీవితం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సుదీర్ఘ కాలంపాటు ముందుకెళ్లడంలో శృంగారానిది కూడా ముఖ్యపాత్రే. శృంగార జీవితం సరిగా లేకపోతే సంసారంలోనూ పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, రోజుకి ఎంతసేపు శృంగారం చేస్తే ఆరోగ్యం అనేదానిపై ఇటీవల సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రతి రోజూ సెక్స్‌ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, హాయిగా నిద్రపోచ్చని చెబుతున్నారు. ప్రధానంగా నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థతో పాటు.. గుండె పనితీరు మెరుగు పడుతుందని అధ్యయనంలో తేలింది. కనీసం వారానికి రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే గుండె పనితీరు బాగుంటుందట.

sex_thumb

అలాగే, శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగేందుకు సెక్స్ దోహదపడుతుందని తెలిపింది. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి వాటి నుంచి శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుందని తెలిపింది. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారానికి మించిన ఔషధం లేదంటున్నారు పరిశోధకులు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు.