You are here
హీరోయిన్‌ చేస్తామని పిలిచి.. వ్యభిచారం చేయించారు ! గాసిప్స్ టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

హీరోయిన్‌ చేస్తామని పిలిచి.. వ్యభిచారం చేయించారు !

సినిమా అంటేనే ఎన్నో ఒడిదొడుకులు.. లాభ, నష్టాలు.. కష్ట, సుఖాలు.. ఇలా అన్ని కోణాలు దాగి ఉంటాయి. సినిమాలో అవకాశాల కోసం శరీరాన్ని నిర్మాతలకు, హీరోలకు అప్పగించి వారితో పడుకోక తప్పదు అనే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఈ ఘటనతో అది నిజమని మరోసారి రుజువైంది. ఆ ఊళ్లో అందరు ఆ యువతిని నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ అన్నారు. ముఖానికి కొంచెం మేకప్‌ వేస్తే హీరోయిన్‌ లాగా ఉంటావ్‌.. ట్రై చేయరాదంటూ సలహా ఇచ్చారు. ఆ యువతి అందరి మాటలు నిజమే అనుకుని సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్‌ చేరుకుంది.

06-1446817276-sexual-harassment

వివరాల్లోకి వెళితే.. ఆ యువతి పేరు పద్మిని. హైదరాబాద్‌ చేరుకుని అమీర్‌ పేటలోని ఓ ఉమెన్స్‌ హాస్టల్‌ లో స్నేహితుల వద్ద కొన్ని రోజుల పాటు ఉంది. ఏదైనా పార్ట్‌ టైం జాబ్‌ చూసుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేద్దామని ఆ యువతి భావించింది. అంతలోనే ఆ యువతికి ఓ ఆఫీసులో రిసెప్టనిస్టుగా అవకాశం దక్కింది. సినిమాల్లో నటించాలంటే ఫోటో షూట్‌ తప్పని సరి అని తెలుసుకుని ఫోటోల కోసం ఓ ఫేమస్‌ స్టిల్‌ ఫోటో గ్రాఫర్‌ ను కలిసింది. దీంతో ఆ యువతి అవశాకాన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఫోటో గ్రాఫర్‌ ఆమెను అడ్డంగా వాడుకున్నాడు. ఆ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి ఆమెను తనకు ఇష్టమొచ్చిన రీతిలో వాడుకున్నాడు. ఫోటోలు తీసి నిర్మాతలకు పంపిస్తానని, నీకు సినిమాల్లో అవకాశాలను ఇప్పిస్తానని చెప్పడంతో ఆ యువతి అతని మాటలను నమ్మి అతడు చెప్పినట్టు చేసింది. దీంతో ఒక రోజు ఆ ఫోటో గ్రాఫర్‌ ఆ యువతితో సినిమా నిర్మాత దగ్గరికి తీసుకుపోతానని చెప్పి అతని దగ్గరికి తీసుకుపోయాడు. ఆ నిర్మాత ఆ యువతిని లొంగదీసుకున్నాడు.

ఇండస్ట్రీలో ఇవన్ని కామన్‌ అని తెలుసుకున్న ఆ యువతి ఎలాగైన సినిమాల్లో నటించాలనే కోరికతో వీటన్నింటిని భరించుకుంటూ అన్నింటికి తలొగ్గి వారు చెప్పినట్టు చేసింది. దీంతో ఆ యువతిని అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆ ఫోటో గ్రాఫర్‌ ఏకంగా 12 మంది ఫోటో గ్రాఫర్స్‌ తో పడుకోబెట్టాడు. అయినా ఆ అమ్మాయికి సినిమాల్లో హీరోయిన్‌ గా కాదు కదా.. కనీసం చిన్న క్యారెక్టర్‌ లో కూడా నటించే అవకాశం రాలేదు.. ఇప్పటికే సినిమాల్లో అవకాశాల కోసం తన శరీరాన్ని పుండు చేసుకుని ఎంతో మందికి పండుగా మారిన ఈ యువతి మరెంత మందిని సుఖపెడుతుందో అని చర్చించుకుంటున్నారు ఆ యువతి గురించి తెలిసిన వాళ్లు.

Related Articles