శీలవతికి సెన్సార్ కట్‌..!

shakila shilavathi

శృంగార భరిత పాత్రలు,సినిమాల్లో నటించి కుర్రకారును ఓ ఊపు ఊపేసిన నటి షకీలా.మలయాళంలో అగ్రహీరోలకు సైతం గట్టిపోటీనిచ్చి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటివరకు 249 సినిమాల్లో నటించిన షకీలా…250వ సినిమా శీలవతిగా ముందుకువస్తోంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్‌ గట్టి షాకిచ్చింది. టైటిల్ మార్చాలని అప్పుడే సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని స్పష్టం చేసింది.

సెన్సార్ అభ్యంతరం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది షకీలా. సినిమా టైటిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేది లేదని చెప్పిన ఆమె, సినిమా చూసి అభిప్రాయం చెప్పాలని కోరింది. ఈ విషయంలో సెన్సార్ బోర్డుతో పోరాడతాను అని ఆమె ప్రకటించింది.

ఈ సినిమా ప్రారంభం నుంచి షకీలా గట్టిగానే ప్రచారం చేసుకుంది. ఈ సినిమా ఆరంభ సమయంలో మీడియా వర్గాలు కూడా షకీలాతో ఇంటర్వ్యూలు చేశాయి. ఈ నేపథ్యంలోనే తన పోరాటానికి చిత్రసీమ మద్దతు ఇవ్వాలని కోరింది. మరి షకీలా పోరాటానికి సెన్సార్ బోర్డు తలొగ్గి ఓకే చెబుతుందో లేదా చూడాలి.