‘ఎన్టీఆర్’ కోసం కీలక పాత్రలో శర్వా‌..

దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించడానికి బాలకృష్ణ గట్టి ప్రయత్నాలే చేశాడు. తేజ డైరెక్షన్‌లో ఈ మెగా ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయాత్నాల్లో భాగంగా ఉన్నట్టుండి తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఒక్కొక్కరి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి  బాలయ్యే ఈ సినిమాను తెరకెక్కిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.

Sharwanand in NTR biopic ?

కానీ బాలయ్య ఈ విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా మూడు బాధ్యతలు మోయడం ఎందుకనో ఏమో.. ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు మరొకరి చేతుల్లో పెట్టాలని భావిస్తున్నారట. అందుకు డైరెక్టర్ క్రిష్‌  తెరపైకి వచ్చింది.

క్రిష్‌తో బాలయ్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ ప్రాజెక్టులో క్రిష్‌ అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమని సమాచారం. మరోవైపు యంగ్ హీరో శర్వానంద్‌కి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ‘ఎన్టీఆర్‌’ చిత్రబృందం శర్వాని సంప్రదించిందని, శర్వా కూడా తన అంగీకారం తెలిపాడని సమాచారం.