తెర వెనుక ‘మా’ సామీ… ..రసికరాజు..?!

Shivaji Raja tried to use me says Artist Shruthi

టాలీవుడ్‌ రసికరాజుల గుట్టు బట్టబయలైన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌ భూతం ఎంతో మంది యువతులను కాటేసిందన్న విషయం శ్రీరెడ్డి వల్ల లీక్‌అయ్యింది. సినీ ఇండస్ట్రీలో ఆఫర్లకోసం కమిట్మెంట్స్ ఇవ్వాల్సివస్తోందంటూ టాలీవుడ్‌ చీకటికోణాన్ని శ్రీరెడ్డి తర్వాత చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటపెట్టారు.

అయితే మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ మూవీ ‘సైరా’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేస్తోన్న తెలుగు నటి శృతి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తానుకూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ భూతానికి చిక్కానని చెప్తూనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాపై సంచలన ఆరోపణలు చేసింది. ఓ మీడియా ఛానల్‌ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో మాట్టాడిన శృతి ‘మా’ అధ్యక్షుడుగా ఉన్న శివాజీరాజా తనను మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడంటూ సంచలన కామెంట్స్‌చేసింది.

హీరో శ్రీకాంత్‌కి, దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేస్తానంటూ మభ్యపెట్టాడని, వేరే అమ్మాయిలను కూడా వాడుకున్నాడని తెలిపింది. అంతేకాకుండా శివాజీరాజా వాడుకున్న వాళ్ళు కూడా ఆధారాలతో సహా బయటపెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చింది శృతి.

శివాజీరాజా లాంటి వాళ్ళు పెద్దలుగా ఉన్న ‘మా’ ద్వారా మాకేం న్యాయం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేసింది. కాగా.. ఇలాంటి వాళ్ళకంటే టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలుగా ఉన్న చిరంజీవి, పవర్‌స్టార్‌ లాంటి వాళ్ళని ‘మా’ ప్రెసిడెంట్‌లుగా చేస్తే సరైన న్యాయం జరుగుతుందంటూ చెప్పుకొచ్చింది శృతి.