శ్రద్దా వచ్చింది..ప్రభాస్ తెచ్చాడు..

Shraddha Kapoor In Prabhas Sahoo Movie

ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ సినిమా షూటింగులో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్నఈ చిత్రానికి సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.అయితే మంగళవారం నుంచి ఆమె సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లపై ఓ ఫ్యాక్టరీ నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధా సెట్లో అడుగుపెట్టింది ఇప్పుడే అయినా.. వారం రోజుల నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటోంది. స్క్రిప్టుని దగ్గర పెట్టుకొని సంభాషణలు ఎలా పలకాలో నేర్చుకొంటోందట.

Shraddha Kapoor In Prabhas Sahoo Movie

మరి తెలుగులో శ్రద్దాకపూర్‌ నటిస్తున్న తొలి చిత్రం కాబట్టి తెలుగు భాషపై పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు మాస్టారునీ నియమించుకొందట. యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.20 కోట్లపైచిలుకు బడ్జెట్‌ కేటాయించారట.

అంతేనా ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌లో ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం మాములుగా లేదని శ్రద్ధ తెగ సంబరపడిపోతుందట. ఈ సినిమా షూటింగులో లంచ్ బ్రేక్ చెప్పాక, తనతో పాటే శ్రద్ధా కపూర్ కి కూడా ప్రభాస్ భోజనం తెప్పించాడట. భోజనంలోకి రకరకాల కూరలు .. పచ్చళ్లు .. పులుసులు ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని శ్రద్ధా కపూర్ అంది. చికెన్ పులుసు .. ఎగ్ కర్రీ .. గోంగూర మటన్ .. పీతల ఇగురు .. ములక్కాడ పులుసు .. తోటకూర .. రోటి పచ్చళ్లతో భోజనం అదిరిందని చెప్పింది. మొత్తానికి ప్రభాస్ తొలి తెలుగు సినిమా షూటింగును .. తెలుగు వారి ఆతిథ్యాన్ని శ్రద్ధా కపూర్ మరిచిపోకుండా చేశాడన్న మాట.ఇక ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.