స్టోరి నచ్చితేనే సినిమా చేస్తా…

Shruthi-Haasan

ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన శృతిహాస‌న్.. కెరీర్ ప్రారంభంలో వ‌రుస ఫెయిల్యూర్స్ తో ఐర‌న్ లెగ్ అనిపించుకంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ఈ అమ్మ‌డు దశ తిరిగింది. ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ వ‌చ్చింది. తెలుగు..త‌మిళ్..హింది ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఆఫ‌ర్ల వ‌ర్షం వెలువెత్తింది. అయితే గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత ఆ రేంజ్ హిట్ ప‌డ‌లేదు ఈ భామకు.

shruti-hasan

అయితే ఈ అందాల సుందరి ఈ మద్య ఫ్యాషన్ రంగంలో ముందుంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇలా అప్పుడప్పుడూ ఫ్యాషన్ మీద మక్కువను ఈవెంట్స్ లో కనబరుస్తోంది ఈ బ్యూటి. అయితే శృతిహాసన్‌ తను నటిస్తున్న సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా లండన్ నుంచి వచ్చిన శృతి కొన్ని ఫ్యాషన్ ఈవెంట్స్ లలో మెరిసింది. ఫైనల్ గా తన ప్రస్తుత సినిమాల గురించి చెబుతూ.. కెరీర్ పై ఓ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తన ఫాథర్ కమల్‌ హాసన్‌తో శభాష్ నాయుడు సినిమాలో నటిస్తున్నానని ఈ సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నానని తెలిపింది.

Shruti-Haasan-

అలాగే హిందీలో చేసిన యారా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉందని, ఈ సంవత్సరం తనకు చాలా స్పెషల్ అని, ఎందుకంటే చేసింది కొన్ని సినిమాలే అయినా అన్ని భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది ఈ అమ్మడు. వెనక్కి తీరిగి చూసుకుంటే నేను ఏం చేశానో నాకు తెలియాలి. నాకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తాను. సినిమా రిజల్ట్స్ బట్టి ఏ సినిమా చెయ్యాలి అనే విషయం గురించి కూడా ఆలోచిస్తానని శృతి వివరించింది.