విలన్‌గా మారిన సిద్ధార్థ్…

Siddharth in Dileep’s film

టాలీవుడ్,కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. తెలుగులో బాయ్స్ చిత్రంతో ఆకట్టుకున్న సిద్దార్థ్..తమిళ్‌లో సైతం పలు చిత్రాల్లో నటించి ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా మలయాళ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అది హీరోగా కాదు విలన్‌గా.

మలయాళ హీరో దిలీప్‌ ప్రధాన పాత్రతో తెరకెక్కుతున్న ‘కమ్మర సంభవం’లో విలన్‌గా సిద్ధార్థ్‌ నటిస్తున్నారు. కథ నచ్చడంతో సిద్ధార్థ్ ఓకే చెప్పినట్లు సమాచారం. చిత్రం షూటింగ్ పూర్తవడానికి రాగా త్వరలో ప్రేక్షకుల ముందుకరానుంది.

పీరియడ్ డ్రామాతో పాటు కొన్ని రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ సైనికుడి పాత్రలో కనిపించనుండగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ది ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ అనే పొలిటికల్ ఆర్గనైజేషన్ కీలకమైన పాత్ర పోషించింది. దీని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సిద్దార్థ్ మలయాళం కూడా నేర్చుకున్నారు. 2012 సంవత్సరంలోనే తనకు మలయాళ హిట్‌ మూవీ ‘ఉస్తద్‌ హోటల్‌’లో అవకాశం వచ్చిందని, అప్పుడు వేరే కారణాల వల్ల సినిమాలో నటించలేదు, అందులో అవకాశం వదులుకోవడం తన దురదృష్టమని తెలిపారు సిద్ధార్థ్.