రజినీ సరసన సిమ్రన్..?

Simran to act opposite Rajinikanth in Karthik Subbaraj project?

సీనియర్ నటి సిమ్రాన్ గతంలో టాప్ హీరోల సరసన నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సిమ్రన్ మరోసారి తెరపై మెరవటానికి ప్రయత్నాలు చేస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా కార్తిక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

 Simran to act opposite Rajinikanth in Karthik Subbaraj project?

మొదటగా ఆ చిత్రంలో రజినీ సరసన హీరోయిన్‌గా త్రిష, మీన నటిస్తున్నారని  వార్తలు వినిపించాయి. కానీ ఉన్నట్టుండి హీరోయిన్‌ పాత్రను సిమ్రన్ దక్కించుకుందని సమాచారం. సిమ్రన్‌  తెలుగులో చివరిగా  నటించిన చిత్రం ‘జాన్‌ అప్పారావు’. ఈ  సినిమా 2008లో వచ్చింది. యాక్షన్‌ డ్రామాగా  తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘కాలా’. ఈ చిత్రం జూన్‌7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై హీరోయిన్‌గా కనిపించనున్న సిమ్రన్ ఏ విధంగ ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటు ఆమె తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది.