ఆరు నెలలు నరకం అనుభవించాను..

సెలబ్రిటీలు సైతం గృహ హింస, వేధింపులకు గురవుతున్న సంఘటనలు అనేకం. ఈ పరిణామాలు చివరకు విడాకులకు దారి తీస్తున్నాయి. ఇలాంటివి ఎదుర్కొన్న సెలబ్రిటీల్లో ప్రముఖ తెలుగు సింగర్ కౌసల్య కూడా ఒకరు. అనేక సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించిన కౌసల్య తన వైవాహిక జీవితం నరకాన్ని తలపింపజేసిందని పేర్కొంది.

 Singer Kousalya talks about her divorce

ఆరేళ్లపాటు తన భర్త తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేశాడని టాలీవుడ్ సింగర్ కౌశల్య ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధలను చెప్పుకుని, భర్త నుంచి విడిపోయిన పరిస్థితులను వివరించింది.

తనకు వివాహం జరిగి ఆరు సంవత్సరాలు గడిచాయని కౌసల్య తెలిపింది. అయితే పెళ్లైన దగ్గర నుంచి తనకు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయని, ఆరేళ్ల పాటు చిత్రవధను అనుభవించానని కౌసల్య వివరించింది. పెళ్లి తర్వాత తనకు స్వేచ్ఛాస్వతంత్రాలు లేకుండా పోయాయని, తన అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. ఈ విధంగా వైవివాహిక జీవితం తనకు నరకప్రాయమైందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలా పెళ్లితో తన జీవితం అన్ని విధాలుగానూ నాశనం అయ్యిందని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె తెలిపారు. భర్త తనను తిడుతూ, దూషిస్తూ చేసిన చాట్ సంభాషణను కూడా తను సేవ్ చేసినట్టుగా కౌసల్య వివరించింది. అనేక సార్లు అతడు చెయి చేసుకున్నాడు, కొంచెం కూడా జాలి చూపకుండా తనను ఇష్టానుసారం కొట్టేవాడని చెప్పిన కౌసల్య తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని కూడా వెల్లడించింది.