తెరపైకి సౌందర్య బయోపిక్…

Soundarya’s Biopic On The Tollywood

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‎ల ట్రెండ్ నడుస్తోంది. మే 11న విడుదలైన మహానటి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాకుండా, ఓవర్సీల్‎లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్‎ఆర్ బయోపిక్‎లు తెరకెక్కుతున్నాయి. మరో యంగ్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తేజ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఒక్కప్పటి అందాల తార సౌందర్య బయోపిక్ కూడా తెరకెక్కించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు నటి సౌందర్య. తన నటన, అందచందాలతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె చేసిన సినిమాల్లో చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ హీరోయిన్‎గా కొనసాగుతున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. అలాంటి ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు నిర్మాత రాజ్‎కందుకూరి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మహానటి విజయంతో తెలుగు తెరపై మరిన్ని బయోపిక్‎లు తెరకెక్కే అవకాశం లేకపోలేదు.