మహేష్…గిఫ్ట్ అదిరింది

SPYDER Telugu Teaser

మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పైడ‌ర్ . సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని మహేష్‌ బర్త్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భయపెట్టడం మాకు తెలుసు..ఆ రోజు అంతమంది మధ్య దాక్కున్నావే అదే భయమంటే అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అందరిని  ఆకట్టుకుంటోండగా బ్లైండ్ డేట్ కావాలి అంటూ రకుల్ డైలాగ్‌ కూడా కట్టిపడేసింది.

పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ చేసేందుకు గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే’ అని ఎస్‌జే సూర్య చెబుతున్న డైలాగ్ టీజ‌ర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఒక నిమిషం పది సెకన్స్ ఉన్న టీజర్ వీడియో ఫ్యాన్స్ లో మాత్రం భారీ అంచనాలను రేకెత్తించింది. హాలీవుడ్ స్టైల్ లో సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు.  తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఒక్క సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, బ్యాలెన్స్ సాంగ్ ని రొమానియాలో చిత్రీక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్‌మైంట్ సంస్థలు సంయుక్తంగా స్పైడర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ జె సూర్య విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. హ‌రీష్‌ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.