వావ్..వుమెన్స్ ఐపీఎల్ జ‌ట్లివే..

womens ipl

భారతదేశంలో అత్యంత ఆధరణ పొందిన ఆటలో క్రికెట్ ఒకటని అందరికి తెలిసిన విషయమే. కాలం మారుతున్న కొద్దీ క్రికెట్ ఆటలో కూడా మార్పులు చాలానే వచ్చాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చాక క్రికెట్ అభిమానులు ఇంకా చాలా ఎక్కువయ్యారు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఆటగాళ్లకు అలాగే క్రికెట్ బోర్డులకు కాసుల వర్షం కురుస్తోంది. వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆ మధ్య ఉమెన్స్ ఐపీఎల్ కూడా నిర్వహించాలని అందరి నుంచి పిలుపు వచ్చింది. మహిళా క్రికెటర్స్ కూడా మేన్స్ తరహాలోనే ఐపీఎల్ ఉమెన్స్ లీగ్ ని నిర్వహించాలని తెలియజేశారు.

womens ipl

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మహిళా క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహిస్తోంది. ఈ నెల 22న ఒక టీ20 మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ముంబైలో ఈనెల 22న జరగనున్న ఐపీఎల్‌-11 తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. భారత మహిళా క్రికెటర్లతో పాటు విదేశీ మహిళా ప్లేయర్లు ఈ టీ20 మ్యాచ్‌లో ఆడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ నెల 22న ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే మైదానంలో రాత్రి 8గంటలకు క్వాలిఫయర్‌-1 జరగనుంది. ఇందులో ఒక జట్టుకు స్మృతి మంధాన, మరో టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్నారు. తాజాగా పోటీపడే రెండు జట్ల మహిళా క్రికెటర్లు, జట్లను బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్: స్మృతి మంధాన(కెప్టెన్), అలీస్సా హేలీ(వికెట్ కీపర్), సుజీ బేట్స్, దీప్తీ శర్మ, బెత్ మూనీ, జెమిమా రొడ్రిగ్స్, డేనియల్లీ హెజెల్, శిఖా పాండే, లీ తాహుహు, జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్, దయాలన్ హేమలత,

ఐపీఎల్ సూపర్‌నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), డేనియెల్లీ వ్యాట్, మిథాలీరాజ్, మెగ్ లానింగ్, సోఫియే డెవినీ, ఎల్సీ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోన మెష్రమ్, పూజ వస్ర్తాకర్, మెగన్, రాజేశ్వరీ గైక్వాడ్, అనుజ పాటిల్, తానియా బాటియా(వికెట్ కీపర్)