నానిపై శ్రీరెడ్డి చేస్తోన్న వ్యాఖ్య‌ల్లో నిజం లేదుః విశాల్

vishal

టాలీవుడ్ లో గ‌త కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం పై ర‌చ్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్యూల‌లో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌పెట్టింది న‌టి శ్రీరెడ్డి. ముఖ్యంగా హీరో నానిని టార్గెట్ చేసింది . గ‌త‌కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో నానిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది శ్రీరెడ్డి. నాని అస‌లు బండారం బ‌య‌ట‌పెడుతా..నీ కాపురం లో చిచ్చు పెడ‌తా అని సోష‌ల్ మీడియా వేదిక‌గా శ్రీరెడ్డి చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై స్పందించాడు నాని. శ్రీరెడ్డికి నాని లీగ‌ల్ నోటిసులు కూడా పంపించాడు.

nani, srireddy, vishal

నాని పంపించిన లీగ‌ల్ నోటిసుల‌పై తాను కూడా చ‌ట్టప‌రంగానే పోరాటం చేస్తాన‌ని తెలిపింది శ్రీరెడ్డి. ఇక శ్రీరెడ్డి నానిపై చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై త‌మిళ హీరో విశాల్ స్పందించారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని తాను కూడా ఒప్పుకుంటాన‌ని. కానీ కొంద‌రు ప్ర‌ముఖుల‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. నాని నాకు మంచి స్నేహితుడ‌ని…అత‌డు అలాంటి వాడుకాద‌ని చెప్పాడు. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల నానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేద‌న్నారు. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు వివాద‌స్ప‌ద‌మైన‌వ‌న్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల నాని ఎంత మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తిస్తారో అంద‌రికి తెలుస‌న్నారు.

nani, srireddy

శ్రీరెడ్డి ప‌లువురు ప్ర‌ముఖ‌ల ప‌ట్ల చేస్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజం ఉంటే ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌న్నారు. భ‌విష్య‌త్తులో శ్రీరెడ్డి నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో అన్నారు. ఆడిష‌న్ పేరిట మ‌హిళ‌ల‌ను మోసం చేయ‌డం త‌ప్పు అని..మ‌న దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి స‌రైన చ‌ట్టం లేద‌న్నారు. నాని విష‌యంలో స‌రైన ఆధారాలు ఉంటే లీగ‌ల్ గా వెళ్లాల‌ని..ఇలా మాటి మాటికి సోష‌ల్ మీడియాలో త‌న ఇష్టం వ‌చ్చి న‌ట్టు పోస్ట్ లు పెట్ట‌డం ప‌ద్ద‌తి కాద‌న్నారు.