శ్రీముఖి…’గుడ్ బ్యాడ్ అగ్లీ’

Srimukhi one more CHANCE|GOOD BAD UGLY HEROINE

పలు రియాలిటీ షోల ద్వారా పేరు తెచ్చుకుని, బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంటుంది.

అయితే ఇప్పటికే అనసూయ, రష్మి లు జబర్దస్త్ టీవి షోతో పాపులర్ అయ్యి సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేయగా.. పటాస్ షోతో రవితో కలిసి రచ్చ చేస్తున్న శ్రీముఖి ఇప్పడు వెండితెరపై ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే పీరియాడిక్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ చేసిన శ్రీముఖి తొలిసారి లీడ్ రోల్‌లో నటిస్తుంది.

 Srimukhi one more CHANCE|GOOD BAD UGLY HEROINE

ప్రముఖ స్టోరీ రైటర్, నటుడు హర్షవర్దన్ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1980లలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఇండస్ట్రీ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ మూవీ హర్షవర్దన్‌తో చేస్తున్నట్టు శ్రీముఖి ఫస్ట్ లుక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది.