సుమంత్..ఉగాది స్పెషల్

sumanth

అక్కినేని ఫ్యామిలీ నుండి పుష్కర కాలం క్రితం టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్‌. ఈ పుష్కర ప్రయాణంలో సుమంత్ సాధించిన సక్సెస్‌లను వేళ్ల మీద లెక్కించొచ్చు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్న సుమంత్…చాలాకాలం తర్వాత నరుడో డోనరుడా అంటూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తర్వాత మళ్లీరావా అని పలకరించిన సుమంత్‌ తిరిగి ఫాంలోకి రావడమే కాదు సక్సెస్‌ బాటపట్టాడు.

తాజాగా తన 25వ సినిమాకు ముహుర్తం ఖరారు చేసుకున్నాడు. ఉగాది పర్వదినాన అన్నపూర్ణ స్టూడియోలో కొత్త సినిమా షూటింగ్‌ మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు జాగర్లపూడి సంతోష్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

సుధాకర్ రెడ్డి బీరం,ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠంతో సినిమా చేయనున్నాడు సుమంత్.