తేజ్ లేకపోతే నేను లేను..!

Sundeep Kishan about Sai Dharam Tej

సాయి ధరమ్ తేజ్, రెజీనా అంటే తనకు బాగా ఇష్టమని  ప్రముఖ హీరో సందీప్ కిషన్ చెప్పాడు.  ఓ ఇంటరవ్యూలో మాట్లాడిన సందీప్‌…తేజ్ అంటే ప్రాణమని చెప్పుకొచ్చాడు.  నా నుంచి ఎలాంటిది ఆశించకుండా సాయం చేసిన వ్యక్తి తేజ్‌ అని..మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నాకు చాలా సాయం చేశాడని తెలిపారు. ఆ క్షణంలో వాడు లేకపోతే నేను ఏమైపోయేవాడినో నాకు తెలియదన్నారు.

కృష్ణవంశీతో సినిమా చేసిన తర్వాత, అందరిలో మంచి చూడటం మాత్రమే నేను నేర్చుకున్నా. సాయిధరమ్ తేజ్, రాహుల్ రవీంద్ర, రెజీనా, ఆది వీళ్లందరితో నేను చాలా క్లోజ్ గా ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్ జెమిని కిరణ్, నిర్మాత అనిల్ సుంకర కోసం అవసరమైతే ఏదైనా చేస్తానని చెప్పాడు .  సినీ ఇండస్ట్రీలో  మామ చోటా కె నాయుడు తర్వాత నాకు అంతటి అండ నిచ్చే వ్యక్తి ప్రొడ్యూసర్ జెమిని కిరణ్, నిర్మాత అనిల్ సుంకర. వాళ్ల కోసం నేను ఏదైనా చేస్తాను.

చోటా మామకు నేను మేనల్లుడిని కాబట్టి నాపై ప్రేమతో ఎంతో చేశారు. అదే, జెమిని కిరణ్ గారికి, నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు. నేనంటే ఆయనకు ఇష్టం కాబట్టి ఈరోజు వరకు ఆయన నా వెన్నంటే ఉన్నారు. ఇండస్ట్రీలో నాకు తండ్రి లాంటి వ్యక్తి అంటే జెమిని కిరణ్ అని తెలిపారు.