సన్నీలియోన్‌ బయోపిక్ టీజర్..

Sunny Leone's Biopic Teaser

సాధారణ అమ్మాయి నుంచి పోర్న్‌ స్టార్‌గా తరువాత బాలీవుడ్ నటిగా మారిన సన్నీలియోన్‌ జీవితం తెర మీదకు రానుంది. ఒక పోర్న్ స్టార్ కు సెలబ్రిటీ స్టేటస్ రావటం.. బాలీవుడ్ సినిమాల్లో వరుసపెట్టి ఛాన్సులు వచ్చేయటం.. మిగిలిన భారతీయ భాషా చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వెల్లువలా రావటం సన్నీ లియాన్ కు మాత్రమే సాధ్యమేమో. కరణ్ జిత్ కౌర్ వోహ్రా అంటే ఏ ఒక్కరికి గుర్తుకు రాని సన్నీ అసలు పేరు ఇది. ఇప్పుడా పేరుతోనే ఆమె బయోపిక్ వచ్చేస్తోంది. కాకుంటే వెండితెర మీద కాదు.. వెబ్ సిరీస్ గా వస్తోంది.

భారతీయ మూలాలున్న సన్నీ ఎందుకు పోర్న్ స్టార్ గా మారింది? ఆమె కాలేజీ జీవితం.. ఏ సందర్భంలో ఆమె అడల్ట్ స్టార్ అయ్యేందుకు మొగ్గు చూపింది లాంటి అంశాలు ఈ బయోపిక్ లో ఉండనున్నాయి. అయితే.. ఈ బయోపిక్ లో సన్నీ పాత్రను ఎవరు చేస్తున్నారంటే.. ఇంకెవరు సన్నీనే.

Sunny Leone's Biopic Teaser

బిగ్ బాస్ చేస్తే సల్మాన్ ఖాన్ ను కలిసే అవకాశం వస్తుందని.. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చన్న ఉద్దేశంతో భారత్లోకి అడుగుపెట్టిన సన్నీకి ఊహించలేని రీతిలో అదరణ రావటం.. అవకాశాలు వచ్చేయటంతో పోర్న్ స్టార్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. స్వల్ప వ్యవధిలో సన్నీ స్టార్ స్టేటస్ న సొంతం చేసుకోవటంతో పాటు.. సుపరిచితురాలిగా మారిపోయింది. సెక్సీ రోల్స్.. ఐటెమ్ సాంగ్స్ తో పాటు.. ఏ అవకాశం దక్కినా వదులుకోకుండా తన సత్తాను చాటుతోంది.

ఇలాంటి వేళ.. తాజాగా ఆమె చేస్తున్న బయోపిక్ టీజర్ తాజాగా విడుదలైంది.ఈ టీజర్ చూసిన వారికి సన్నీ జీవితంలో పోరాటం ఎంత ఉందో తెలీటంతో పాటు.. ఒక సింఫుల్ గాళ.. పోర్న్ స్టార్ గా ఎలా రూపాంతరం చెందిందో ఇట్టే అర్థమవుతుంది. స్కూల్ డేస్ నుంచి అసలేం జరిగిందన్న విషయాన్ని చూపించనున్నారు. నాటి పరిస్థితుల్ని వివరించనున్నారు.అయితే.. వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూసేయటం సాధ్యం కాదు. జీ5 ఛానల్ లో మాత్రమే ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉండనుంది. వారు కోరినంత మొత్తాన్ని చెల్లించి మాత్రమే దీన్ని చూసే వీలుంది.