అంతరిక్షంలోకి జై సింహా..!

SV Krishna Reddy for Balaliah

గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు రవికుమార్‌తో జై సింహా చేస్తున్న బాలయ్య తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించనున్నాడు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సమయం ఉండటంతో కుటుంబ కథ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.

ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కథను ఎస్వీ కృష్ణారెడ్డి వినిపించడంతో, బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో  బాలకృష్ణ అంతరిక్ష యాత్రికుడిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.

SV Krishna Reddy for Balaliah

గతంలో  ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ మూవీ యమలీల ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక బాలయ్య హీరోగా వచ్చిన ఆదిత్య 369 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.   టైమ్ మిషన్‌లో ప్రయాణించే బాలకృష్ణ వందల ఏళ్లు వెనకకు వెళ్తాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోకి కూడా ప్రవేశిస్తాడు. ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించిన ఆ చిత్రం సినీ విమర్శకులను కూడా మెప్పించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో  ఫాంటసి కథతో సినిమా వస్తుండటంతో ఆదిత్య 369కు సీక్వెల్‌ అన్న ప్రచారం జరుగుతోంది.