ఈ దేశానికి చికిత్స అవసరం-తమన్నా..

Tamannaah-Bhatia Tweets On Nirbayas

మిల్కీ బ్యూటీ తమ్మన్నా సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ఘాటైన ట్వీట్ చేసింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా బాలికలపై, యువతులపై దాడులు జరుతుంటే ఈ దేశం ఏం చేస్తుందని ప్రశ్నించింది. జమ్మూకాశ్మీర్‎లో 8 ఏళ్ల బాలిక రేప్‎కు గురైంది. ఉత్తర్‎ప్రదేశ్‎లోని ఉన్నావ్‎లో ఓ 16 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనను నిరసిస్తూ.. న్యాయం కోసం పోరాడుతూ ఆమె తండ్రిని కోల్పోయింది. ఈ దేశం ఎటుపోతుంది? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంస్కరణలు తెచ్చేందుకు ఇంకెంత మంది నిర్భయలు ప్రాణత్యాగం చేయాలంది. కనీసం తన మహిళలను కాపాడుకోలేని దేశం కూడా ఓ దేశమేనా? మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ దేశానికి చికిత్స అవసరమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.