‘స్వింగ్ జర’ అంటున్న తమన్నా.. !

Tamannah's masala song in NTR's Jailavakusa
Tamannah's masala song in NTR's Jailavakusa

సెప్టెంబర్ 21న థియేటర్స్ లోకి రానున్న జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ అభిమానులలో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాడు. ట్రైలర్స్, పాటలు అన్నీ జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో ఏర్పడ్డ పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి సారి మూడు విభిన్న పాత్రలలో కనిపించడంతో ఆయన నటన ఎలా ఉంటుందో చూడలానే ఆసక్తి అందరిలోనూ ఉండగా దాన్ని అలాగే నిలిపి ఉండేందుకు ఇంకో అంశాన్ని సిద్ధం చేసింది టీమ్. ఇప్పటికే నాలుగు పాటలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసిన చిత్ర యూనిట్ మరో ఐటెం ప్రోమోను విడుదల చేసేందుకు సిద్దమైంది.

‘స్వింగ్ జర’ అనే పాటను ఈ రోజు సాయంత్రం 5.40 ని.లకు విడుదల చేయశారు. సాంగ్ లోని తమన్నా గ్లామర్ లుక్ విడుదల చేసి ఈ విషయాన్ని తెలియజేసింది నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ , తమన్నా కాంబినేషన్ లో రూపొందిన ఈ సాంగ్ కొరియోగ్రఫీ దగ్గర్నుంచి మ్యూజిక్ వరకు అన్నింటిలోనూ కొత్తదనం ఉండే ఈ పాట అభిమానులకు, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందట.