అర్జున్ రెడ్డి కి హీరోయిన్ కావాలట

vikram-dhruv

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్మ పేరు మార్మోగిపోతోంది. అయితే నేను చెప్పేది రాంగోపాల్ వర్మ గురించి కాదు… కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్….. తన కొడుకు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నది. అది కూడా…. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ కు తమిళ్ లో వర్మ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. బాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వర్మ సినిమాలోని హీరోయిన్ పై తాజాగా సస్పెన్స్ వీడింది.

vikram-son-dhruv-

మొన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయిపై చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవర్నీ సెలక్ట్ చేయలేదు మేకర్స్. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలిని పాండేనే రిపీట్ చేస్తారని కొందరన్నారు. ఇదే లిస్ట్ లో హెబ్బా పటేల్ పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా ఈ సస్పెన్స్ వీడింది. డెబ్యూ హీరో సరసన కొత్త ఫేస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చారు.

vikram-son-dhruv-

ఓ అందమైన అమ్మాయి వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు విక్రమ్. ఆ వీడియోలో అమ్మాయి ముఖం కనిపించదు. అమ్మాయి లక్షణాల్ని మాత్రం వివరించారు. ఇలాంటి క్వాలిటీస్ మీలో కూడా ఉంటే వెంటనే మీ ఫొటోస్ తో పాటు డీటెయిల్స్ మెయిల్ చేయమని కోరాడు విక్రమ్. వీలైనంత తొందరగా హీరోయిన్ ను ఎంపిక చేస్తామని, ఆలస్యం చేయొద్దని కోరాడు. త్వరలోనే వర్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది.