ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి తప్పుకున్న తేజ..

Teja Out from NTR Biopic

లెజండరీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య-తేజ కాంబినేషన్‌లో ఇటీవలె ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. అంతేగాదు ఈ సినిమా భావితరాలకు ఆదర్శంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

అయితే, అనుకోకుండా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు దర్శకుడు తేజ సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్టీఆర్‌కి వీరాభిమానినని, ఈ సినిమాకి న్యాయం చేయలేకపోతానని తనకు అనిపిస్తోందని ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.

Teja  Out from NTR Biopic

బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్‌ పేరుతో ఈ సినిమాను బాలకృష్ణ నిర్మిస్తున్నారు. రామకృష్ణ స్టూడియోలో చిత్ర షూటింగ్ జరుగుతుండగా తేజ తప్పుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. ఎన్టీఆర్‌ అనేక మంది సినీ తారలతో కలిసి వెండితెరను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ను నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది.