తేజాతో తేడా సింగ్‌‌..

Teja to direct Balayya?

ఎన్టీఆర్ జీవిత చరిత్ర, విశేషాలతో సినిమా వస్తుందని నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే నటిస్తున్నాని ప్రకటించిన బాలకృష్ణ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాడు.అయితే బాల‌కృష్ణ ఎప్పుడు ఎవ‌రికి అవ‌కాశం ఇస్తాడో ఊహించ‌డం చాలా క‌ష్టం. అందుకే ఆశ్చ‌ర్య‌పోయే కాంబోలు సెట్ అయిపోతుంటాయి. పూరి బాల‌య్య కాంబో ఎవ్వ‌రూ ఊహించలేదు. సినిమాల‌కు దూరంగా ఉంటున్న బి.గోపాల్‌ని పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు బాల‌య్య‌. ఇప్పుడు తేజ‌కీ ఊహించ‌ని ఆఫర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Teja to direct Balayya?

గత కొన్ని సంవత్సరాలుగా వరుస పరాజయాలతో సతమతమై, ఇటీవలే రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేసిన దర్శకుడు తేజకు మరో బంపర్‌ ఆఫర్ లభించిందని తెలుస్తోంది. తన కెరీర్ లో ఎక్కువగా కొత్త వారితో పని చేయాలని భావించే తేజ, ఇప్పుడు టాప్ హీరోలతో చిత్రాలు చేయాలని భావిస్తుండగా, నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తేజకు పిలుపు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఎంతో మంది పెద్ద నిర్మాతలు తేజతో చిత్రం చేసేందుకు క్యూలో ఉండగా, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను తలపెట్టిన చిత్రానికి తేజతో దర్శకత్వం చేయించాలని బాలయ్య భావిస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ విషయంలో బాలకృష్ణ, తేజల మధ్య చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దాదాపుగా ఎన్టీఆర్ బయోపిక్ కు తేజ దర్శకుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.