వివాదంలో సానియా మీర్జా..

Sania Mirzas strong reply to a fan who questioned her nationality ...

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పౌల్ట్రీయాడ్ లో నటించిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ సానియా మీర్జాకు సెంటర్‌ ఫర్ సైన్స్ ఎన్విరాన్ మెంట్( సీఎస్‌ఈ) అల్టీమేటం జారీ చేసింది. అడ్వర్టైజ్ మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిబంధలనకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనల్లో నటించరాదని చెప్పింది.

కోడిమాంసం ఉత్పత్తులలో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయంటూ 2014లో సీఎస్ఈ ఇచ్చిన నివేదికను అపహాస్యం చేసేలా అడ్వర్టైజ్ మెంట్ ఉందని సీఎస్ఈ అధికారి తెలిపారు. ఒక రోల్ మోడల్ గా ఇలాంటి ప్రకటనల్లో సానియా నటించడం మంచిది కాదని చెప్పారు. వెంటనే ఈ యాడ్ నుంచి ఆమె తప్పుకోవాలని లేదా అడ్వర్టైజ్ మెంట్ ను కొత్తగా రూపొందించాలని డిమాండ్ చేశారు.

2014లో జరిపిన పరీక్షల్లో చికెన్‌లో యాంటీ బయాటిక్స్ అవశేషాలను సీఎస్‌ఈ గుర్తించింది. ఈ యాడ్‌ను మార్చడమో పూర్తిగా తొలగించడమో చేయాలని అడ్వర్‌టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆలిండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌ను ఆదేశించింది.