తెలంగాణ…సఫల ప్రయోగం

Telangana Developing state in India

విజయశాంతిని అడవిపాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదన్నారు. కాంగ్రెస్ ద్రోహ చరిత్రను ఎండగట్టిన కేసీఆర్ వచ్చిన తెలంగాణను రాజకీయ సుస్ధిరత వైపు నడిపిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ విఫల ప్రయోగం కాదు సఫల ప్రయోగయని నిరూపించాల్నిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయ సుస్ధిరత కోసమే టీడీపీ,వైసీపీ,సీపీఐ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనమయ్యారని తెలిపారు.

తెలంగాణను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసన్నారు. తెలంగాణను తెచ్చుడు ఎంతనీతో…దానిని నిలబెట్టడం కేసీఆర్‌ నీతి అని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలకు నచ్చనంతా మాత్రానా ఒరిగేదేమి లేదన్నారు. వందశాతం అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు.6300 పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులిచ్చామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతుందన్నారు. సెక్రటేరియట్‌లో అవినీతిని తగ్గించామని…ఓపెన్ టెండర్లతో ప్రజల మన్ననలు పొందామన్నారు. ఒక్కరూపాయి అవినీతిని నిరూపించకుండా అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు.