సంక్షేమంలో తెలంగాణ టాప్‌..

kcr

అనతికాలంలోనే తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన స్వల్పకాలంలోనే విద్యుత్ కష్టాలను అధిగమించామని చెప్పారు.

సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ,కాకతీయ లాంటి పథకాలతో తెలంగాణకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇంకా ఫ్యూడల్ భావజాలంలోనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

హరితహారం పథకంతో ఆకుపచ్చ తెలంగాణ మారుతోందన్నారు.పేద,మైనార్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. నాడు పీజు రీయంబర్స్‌మెంట్స్‌ కోసం ఆందోళనలు జరిగేవని కానీ నేడు ఆ పరిస్ధితి లేదన్నారు. 3223 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.