తెర‌పైకి మ‌రో బ‌యోపిక్…హీరోగా సుధీర్ బాబు

_sudheer babu

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోంది. అల‌నాటి న‌టి అందాల తార సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా మ‌హాన‌టి మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దింతో ఆ సినిమా విడుద‌ల త‌ర్వాత చాలా మంది ప్ర‌ముఖుల బయోపిక్ లు తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో వ్య‌క్తి బ‌యోపిక్ ను తెర‌కెక్కించునున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఎవ‌రో కాదు ప్ర‌ముఖ బ్యాండ్మింట‌న్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్ జీవిత కథ ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్కనున్న‌ట్లు తెలుస్తోంది.

sudheer, gopichand, praveen sattaru

అయితే ఈబ‌యోపిక్ లో గోపిచంద్ పాత్ర‌లో హీరో సుధీర్ బాబు న‌టించ‌న‌నున్నట్లు స‌మాచారం. సుధీర్ బాబుకి బ్యాడ్మింట‌న్ లో మంచి గ్రిప్ ఉండ‌టంతో ఆయ‌న‌ను ఈసినిమాలో హీరోగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ బ‌యోపిక్ కోసం సుధీర్ బాబు చాలాకాలంగా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోన్నాడు. ఇక ఈసినిమాకు ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత ప్ర‌వీణ్ స‌త్తారు పేరు వినిపిస్తోంది. చాల రోజులు క్రీత‌మే ఈబ‌యోపిక్ తెర‌కెక్కించాల‌నుకున్నా  ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది.

త్వ‌ర‌లోనే ఈబ‌యోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లెందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. సెప్టెంబ‌ర్ మొద‌టి వారం నుంచి ఈసినిమా షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక సుధీర్ బాబు ప్ర‌స్తుతం స‌మ్మోహనం సినిమా లో న‌టించాడు. . ఈనెల 15వ తేదిన సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాపై  భారీ ఆశలు పెట్టుకున్నాడు సుధీర్ బాబు.