ఈ బౌలింగ్‌ స్టైల్‌ ఎప్పుడైనా చూశారా..!

The new action king

సఫారీ బౌలర్‌ పాల్‌ ఆడమ్స్‌ గుర్తున్నాడా? విచిత్ర బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆడమ్స్ అప్పట్లో ఓ సంచలనం. పిచ్‌ని చూడకుండా బౌలింగ్‌ చేయడం అప్పట్లో ఓ సంచలనం. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆడమ్స్‌ని గుర్తు చేస్తూ మరో బౌలర్‌ వచ్చాడు.

ఆ బౌలర్‌ పేరు కెవిన్ కొత్తిగొడ.  18 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ శ్రీలంకలోని గాలెకు చెందినవాడు. అండర్ 19 ఏషియాకప్‌లో ఇతను తెరపైకి వచ్చాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో కెవిన్ బౌలింగ్ యాక్షన్ చూసి చాలా మంది కంగుతిన్నారు. ఆ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చిన కెవిన్.. ఒక వికెట్ తీశాడు.

పిచ్‌ను, వికెట్లను చూడకుండా అతడు బౌలింగ్‌ చేయడం కెవిన్‌ ప్రత్యేకత! రాబోయే రోజుల్లో అతడు లంక సీనియర్‌ జట్టులో కీలకపాత్ర పోషిస్తాడని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు.ఓ సారి ఆ బౌలింగ్‌ని మీరు చూడండి…