రివ్యూ:తొలిప్రేమ

Tholi Prema Review

కెరియర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ జానర్స్‌లో వైవిధ్య పాత్రలు చేసినా.. ఫిదా చిత్రంతో లవర్ బాయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మళ్లీ ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కెరీర్ బ్రేక్ మూవీ తొలిప్రేమ.  అలాంటి టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ తేజ్‌కి ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్నిచ్చిందో తెలుసుకుందాం.

క‌థ‌:

లండన్ లో ఉంటున్న ఆదిత్య (వరుణ్ తేజ్) తన ఫెయిల్యూర్ లవ్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ప్లస్ 2 టైంలో ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు ఆదిత్య. ఆ తర్వాత ఇద్దరు సేం కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఆదిత్య లవ్ ప్రపోజల్స్ కు ఓకే చెప్పేస్తుంది వర్ష. ఇంతలోనే ఇద్దరు పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ 6 ఏళ్ల తర్వాత కలుస్తారు.. అప్పుడు మళ్లీ ఇద్దరు ప్రేమించుకుంటారు.. ఇంతకీ వర్ష, ఆదిత్య లవ్ యాక్సెప్ట్ చేసిందా..? వారిద్దరు ఎందుకు విడిపోతారు..? అన్నది సినిమా కథ.

TholiPrema

ప్లస్ పాయింట్స్:

సినమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ హీరో,హీరోయిన్స్ క్యారెక్టర్స్,డైలాగ్స్,సినిమాటోగ్రఫీ. ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. ఫిదా సినిమాతో లవర్ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న వరుణ్ ఈ సినిమాలో ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేశాడు. స్టైలిష్ గా కనిపించాడు. వర్ష పాత్రకు రాశీఖన్నా పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌ లో రాశీఖన్నా నటనకు ఆడియన్స్‌ ఫిదా అవుతారు. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శి ,సీనియర్‌ నటులు నరేష్‌, సుహాసిని తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ , సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపిస్తుంది

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి కథ కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. తొలిప్రేమ లాంటి టైటిల్ కు ఎలాంటి కథ అవసరమో అదే కథతో వచ్చాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్స్. ఫారిన్ లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. తమన్ మ్యూజిక్ కూడా కొత్తగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

TholiPrema

తీర్పు:

పెద్దగా ప్రయోగాలు చేయకుండా ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో తొలి ప్రేమ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు దర్శకుడు వెంకీ. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం తరువాత విడిపోవటం తిరిగి కలుసుకోవటం అన్నది గతంలో చాలా సినిమాల్లో చూసిన కథే అయినా.. తనదైన కథనంతో తొలిప‍్రేమను ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి సక్సెస్‌ సాధించాడు. తొలి భాగాన్ని యూత్‌ మెచ్చే ఎంటర్‌టైనింగ్‌ అంశాలతో తెరకెక్కించిన వెంకీ..సెకండాఫ్‌పై కాస్త దృష్టిపెడితే బాగుండేది. ఓవరాల్‌గా యూత్‌ని నచ్చే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తొలిప్రేమ.

విడుదల తేదీ:10/02/2018
రేటింగ్:2.5/5
నటీనటులు : వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా
సంగీతం : తమన్
నిర్మాత : బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌
దర్శకత్వం : వెంకీ అట్లూరి