దసరా హంగామా.. ఎవరు గెలుస్తారో..?

Tollywood Dasara Hangama

దసరా అంటేనే హంగామా.. వరుస సెలవులు ఉండడంతో ఫ్యామిలీలతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. అదే స్థాయిలో సినిమాలు కూడా దసరా బరిలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బడా హీరోలకు పోటీగా.. యంగ్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు.

NTR Aravid Sametha

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పక్కా ప్రణాళికలతో దసరా బరిలోకి తీసుకురావడానికి సిద్దం అవుతున్నారు. మరోవైపు కింగ్ నాగార్జున-నేచురల్ స్టార్ నాని మల్టి స్టారర్ మూవీ కూడా దసరా బరిలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Nani-nagarjuna

వరుస ఫ్లాప్ సినిమాలతో అవకాశాలు లేని శ్రీనువైట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరికెక్కిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. రెండు ఫ్లాప్ లు మూటగట్టుకున్న మాస్ మహారాజ కథానాయకుడి నటిస్తున్నారు. ఈ సినిమాతో ఇటు రవితేజ, అటు శ్రీనువైట్ల సైతం దసరా బరిలో నిలిచి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. మరో యంగ్ హీరో రామ్ నటిస్తున్న ‘హలో గురు’ ప్రేమకోసమే చిత్రం కూడా దసరా బరిలోకి తీసుకురావడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.

ravi-teja-amar-akbar-anthony

విభిన్నమైన కథలతో భారి విజయాలను అందుకున్న యంగ్ హీరో శర్వానంద్. తన కథా బలంతో పెద్ద హీరోలతో సైతం పోటీపడి విజయం సాధిస్తుంటారు శర్వానంద్. ఇప్పుడు ఆయన తాజగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ సినిమాను దసరాకి విడుదల చేయడానికి సిద్దం అవుతున్నాడు.

ఇప్పుడు ఈ దసరా బరిలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని రానున్నారని సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఫారిన్ లో షూటింగ్ ప్రారంభించారట. ఇంతమంది హీరోలు దసరా బరిలోకి వస్తుండడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఏ హీరో దసరా బరిలో గెలుస్తాడో..? ఏ హీరో బోల్తా పడతాడో వేచి చూడాలి.