ఈ హీరోలకు… సక్సెస్‌ పుష్కరాలేనా..!

Tollywood Floop Heroes

సినిమా ఓ రంగుల ప్రపంచం…ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు ఆ కిక్కే వేరు. అలాంటి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ పూలపాన్పుకాదు. ఎన్నోకష్టాలు పడి  ఒక్కఛాన్స్ కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు అగ్రహీరోలుగా వెలుగొందిన నటీనటులు ఎంతోమంది. వారిబాటలోనే ఎంతోమంది వారసులు వచ్చారు. కొంతమంది నిలదొక్కుకొగా..చాలా వరకు సైడ్‌ అయ్యారు. మరికొంతమంది పుష్కరాలకోసారి హిట్‌ కొట్టినా… ప్రయత్నించడంలో మాత్రం  వెనుకడుగేయడం లేదు. అలాంటి వారిలో కొందరు…

అలాంటివారిలో కొందరు..హీరో రామ్‌..ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కుమారుడు. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్‌ ఇప్పటివరకు 15 సినిమాలు చేశాడు. అయితే వీటిలో హిట్టైన సినిమాలు నాలుగు మాత్రమే. రెడీ సినిమాతో హిట్ కొట్టినా తర్వాత సక్సెస్ బాటపట్టేందుకు పదిసినిమాలు చేయాల్సివచ్చింది. గత సంవత్సరం వచ్చిన నేను శైలజతో మళ్లీ సక్సెస్ బాటపట్టిన తర్వాత హైపర్,ఉన్నది ఒకటే జిందగితో నిరాశపర్చాడు.

Tollywood Floop Heroes
నందమూరి-నారా ఫ్యామిలీ నుంచి వెండితెర ఆరంగేట్రం చేసిన హీరో నారా రోహిత్. బాణం , సోలో,ప్రతినిధి వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  హిట్‌,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా 20కి పైగా సినిమాలు చేసిన రోహిత్ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కి పుష్కరాల కాలమే అయింది.

ఇక మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఇందుకు అతీతులు కారు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్‌. పవన్ ప్రోత్సాహంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో రేయ్‌,పిల్లా నువ్వులేని జీవితం వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత సీన్ రివర్సైంది. సుప్రీమ్ దగ్గరి నుంచి లెటెస్ట్‌గా వచ్చిన జవాన్‌ వరకు తేజుకు అన్ని ఫ్లాపులే.

దర్శకుడు తేజ జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో నితిన్‌. తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఎంట్రీ తెలిగ్గానే దొరికింది. దిల్,సంబరం,సై వంటి మూవీలతో అదరగొట్టిన నితిన్‌ ప్రేక్షకులు గుర్తించదగ్గ హీరోగా ఎదిగాడు. కానీ తర్వాత  కథలు ఎంచుకోవడంలో నిర్లక్ష్యమో ఏమో తెలియదు కానీ 2005  నుంచి  2011 వరకు వచ్చిన నితిన్ సినిమాలన్ని ఫ్లాపులే.  తర్వాత ఇష్క్‌,గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలతో విజయాల బాటపట్టిన అ..ఆ సినిమా వచ్చే వరకు నితిన్‌కు హిట్ సినిమాలే లేవు. రీసెంట్‌గా వచ్చిన లై సినిమా సైతం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

ఇండస్ట్రీలో తమ కుటుంబాలకు ఉన్న పరిచయాలతో ఎంట్రీ ఇచ్చిన హీరోలు వరుణ్‌ సందేశ్, నిఖిల్, సందీప్ కిషన్.  కెరీర్ తొలినాళ్లలో మంచిగుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోలు సక్సెస్ ట్రాక్‌ ఎక్కిచాలా కాలమే అయింది. మొత్తంగా వీరే కాదు ఇండస్ట్రీలో మరికొంతమంది హీరో,హీరోయిన్లు హిట్ చూసి పుష్కరాల కాలమే అవుతోంది.