You are here
మీనా..మళ్ళీ తల్లైంది.. గాసిప్స్ టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

మీనా..మళ్ళీ తల్లైంది..

తెలుగు .. తమిళ భాషల్లో నటించిన నిన్నటితరం కథానాయికల్లో మీనా ఒకరు. ఈ సీనియర్‌ హీరోయిన్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి, తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తోంది.

అలా ‘దృశ్యం; సినిమాలో టీనేజ్ అమ్మాయికి తల్లిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి అభినందనలు అందుకుంది. అయితే ఇదే క్రమంలో మీనా మళ్ళీ తల్లి పాత్రలో కనిపించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట.

tollywood heroine meena did mother charector again

జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మీనా హీరోకి తల్లిగా కనిపించనుందట. అయితే హీరో చిన్నప్పటి సీన్స్ వరుకు మాత్రమే మీనా కనిపిస్తుందా..? లేక సినిమా అంత కనిపిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో తల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ కే దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర టీమ్‌.

Related Articles