టచ్ చేసి చూడు సాంగ్ ప్రోమో…

Touch Chesi Chudu Movie Songs

రాజా ది గ్రేట్‌ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న హీరో రవితేజ. ఈ సినిమా హిట్‌తో వరుస సినిమాలకు కమిట్ అయిన రవితేజ ప్రస్తుతం టచ్‌ చేసి చూడు సినిమాలో చేస్తున్నాడు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ సరసన రాశీఖన్నా హీరయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఫస్ట్ లుక్‌, టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇటీవలె ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.తాజాగా మూవీకి సంబంధించి పుష్ప సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇది రవితేజ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది.

ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి మెడలో టైరు వేసి ఈడ్చిపారేస్తూ రవితేజ కనిపించారు. ఆ తర్వాత కళ్లాద్దాలు తీసి స్టైల్‌గా రవితేజ నడిచి వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటోంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.