బాలయ్యను ముంచిన పూరి…!

Trade Talk : Paisa vasool Huge Loss

పైసా వ‌సూల్ సినిమా స్టార్ట్ అయిన‌ప్పుడే బాల‌య్య ఏం చూసుకుని పూరికి క‌మిట్ అయ్య‌డ్రా బాబూ అని చాలా మంది త‌ల‌లు పట్టుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయిన గ‌త శుక్ర‌వారం ఉద‌యానికే వాళ్ల అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. థియేట‌ర్ల‌కు వెళ్లిన బాల‌య్య అభిమానులు, సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా త‌ల‌లు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు.

దాదాపు 33 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడయిన ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి 18  కోట్లు కూడా సాధించలేకపోయిందని సమాచారం. రెండో వారానికి కొత్త సినిమాలు వచ్చి థియేటర్స్ ను ఆక్రమించేశాయి. ఈ నేపథ్యంలో పుంజుకునే అవకాశాలు తక్కువే. ఓవరాల్ గా బాలయ్య 101 ఫైనాన్షియల్ గా బయ్యర్స్‌ను తీవ్ర నష్టాల్లో ముంచేస్తోందని తెలుస్తోంది.

గ‌త శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.15 కోట్ల షేర్ రాబ‌ట్టి, ఆ త‌ర్వాత చేతులు ఎత్తేసింది. ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో రూ.18 కోట్ల‌కు మించి వ‌సూలు చేయ‌దంటున్నారు. ఈ లెక్క‌న చూస్తే నిర్మాత‌ల‌కు ఏకంగా ఓ రూ.15 కోట్ల వ‌ర‌కు లాస్ త‌ప్పేలా లేదు.

సీడెడ్ ఏరియాలో ‘పైసా వసూల్’ చిత్రాన్ని రూ. 6 కోట్లకు అమ్మారు. నైజాం ఏరియాలో  రూ. 8 కోట్లకు ,కోస్తా ఏరియాలో రూ. 14.1 కోట్లకు, గుంటూరు ఏరియాలో 3.6 కోట్లకు అమ్మారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు.