టీఆర్ఎస్‌ది విజయాల పరంపర..

TRS Won 2019 Elections

టీఆర్ఎస్‌ది విజయాల పరంపర అని సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్‌లో మొదలైన టీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రతి ఉప ఎన్నికల్లో అప్రతిహాతంగా సాగుతోందన్నారు.జీహెచ్‌ఎంసీలో 150 సీట్లకు గాను మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి 144 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు అనారోగ్యంతో మరణిస్తే అక్కడ కూడా సానుభూతి పవనాలను తట్టుకుని భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేశామన్నారు.

అచ్చంపేటలో 20 వార్డులకు గాను 20 స్ధానాల్లో గెలుపొందామని చెప్పారు. ప్రతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌దే గెలుపని స్పష్టం చేశారు.

ప్రజలు టీఆర్ఎస్‌ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని ప్రజల అండ ఉన్నంత వరకు తమ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. విపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరచి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించాలన్నారు.

2014 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నేరవేర్చామన్నారు సీఎం కేసీఆర్. మేనిఫెస్టోలో పెట్టినవే కాదు 24 కొత్త పథకాలను అమలుచేస్తున్నామని తెలిపారు.