అక్ష‌య్ బర్త్‌డేకి ట్వంకిల్‌ గిఫ్ట్‌..

Twinkle Khanna Wished Akshay Kumar Happy Birthday

అక్షయ్ కుమార్ మూవీ కెరీర్ యాక్షన్ సినిమాలతో స్టార్టయింది. బాలీవుడ్ నటుల్లో పేరు తెచ్చుకున్న కుమార్ లు చాలామందే ఉన్నారు. దిలీప్ కుమార్, రాజేంద్ర కుమార్, సంజీవ్ కుమార్, రాజ్ కుమార్ ఇలా ఎందరో. ఈ జనరేషన్ హీరో అక్షయ్ కుమార్. ఆయన్ను ఖిలాడీ కుమార్ అని కూడా అంటారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ ఓం భాటియా. ఇతన్ని ముద్దుగా అక్కీ అని కూడా అంటారు. అతపి సన్నిహితులు అక్షయ్, ఖిలాడీ, ఖిలాడీ కుమార్, కింగ్ కుమార్ అని కూడా పిలుస్తారు. 1990లలో సినీరంగానికి వచ్చిన అక్షయ్ ఇప్పటికి సెంచరీ దాటి దాదాపు 30 చిత్రాలలో చేశాడు.

Twinkle Khanna Wished Akshay Kumar Happy Birthday

ఖిలాడీ పేరున్న సినిమాల్లో యాక్ట్ చేయడంతో ఖిలాడీకుమార్ అనే పేరు తెచ్చుకున్నాడు. రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న అక్కీకి వక్త్ హమారా హై, మొహ్రా, ఫ్లాన్, సుహాగ్, సపూత్, అంగారే, కీమత్ – దే ఆర్ బ్యాక్, సంఘర్ష్ వంటి సినిమాలు పేరు తెచ్చాయి. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికీ వ‌రుస హిట్ల‌తో అద‌ర‌గొడుతున్న అక్ష‌య్ కుమార్ ఈరోజు 50వ పుట్టిన‌రోజు జరుపుకుంటున్నాడు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న భార్య ట్వింకిల్ ఖ‌న్నా ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇంట్లో కింద కూర్చుని.. అడుగుతున్న‌ దానికి సమాధానంగా.. ఒక్కో భావాన్ని అక్ష‌య్ అల్ల‌రిగా ప‌లికిస్తుండ‌టాన్ని చూడొచ్చు. `నా మంచి స్నేహితుడు, ప్ర‌పంచంలోనే అత్యంత‌ ద‌య‌గ‌ల వ్య‌క్తి, గొప్ప తండ్రి, ఉత్త‌మ డ్యాన్స‌ర్‌, అన్నింటికంటే ముఖ్యంగా అత‌ని హాట్‌నెస్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు` అని ట్వింకిల్ ఖ‌న్నా ట్వీట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌గా మారింది.