ఉదయ్ కిరణ్‌ బయోపిక్‌పై తేజ క్లారిటీ..

teja

చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ. కొంత కాలంగా సక్సెస్ కు దూరమైన తేజ…నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ స్వింగ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం తేజ…వెంకీతో ఆట నాదే వేట నాదే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నాడని.. ఈ సినిమాకు ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలను ఖండించాడు తేజ. తాను ఎలాంటి బయోపిక్‌లు తెరకెక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులు ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలియదని.. తాను ప్రస్తుతం కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రానా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌ నుంచి తేజ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ చిత్రమంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయని… వాటిని తాను అందుకోలేనని అందుకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని తేజ చెప్పారు.

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా చేశాడు. ఈ సినిమా అతని కెరీర్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఒత్తిడి తట్టుకోలేక 2014 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉదయ్‌ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించే బాధ్యతను తేజ భుజానా వేసుకున్నాడనే వార్తలు వెలువడ్డాయి.