‘నీ తోనే’ అంటున్న భాను..

Udaya Bhanu Is Giving Re Entry As Anchor

యాంకర్‌గా ఉదయభాను బుల్లి తెరపై హై సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ వార్త మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

Udaya Bhanu Is Giving Re Entry As Anchor

ఒకప్పుడు ‘హృదయాంజలి’ పేరుతో ఈటీవీ చానల్లో మొదలైన ప్రోగ్రామ్ తో ఉదయభాను కుర్రకారు ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. ఆ తరువాత ఆమె ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా సినిమా ఫంక్షన్స్ ను ఎంతో ఉత్సాహభరితంగా నడిపించింది. ఆ తరువాత ఉదయభానుకు వివాహం జరగడం .. ఆమెకు ట్విన్స్ జన్మించడం జరిగింది. ఇటీవలే ఆ ట్విన్స్ ఫస్టు బర్త్ డే వేడుకను కూడా జరిపింది.

Udaya Bhanu Is Giving Re Entry As Anchor

అలాంటి ఉదయభాను బుల్లితెర ప్రేక్షకులను హుషారెత్తించడానికి మళ్లీ రంగంలోకి దిగుతోందని సమాచారం. ‘స్టార్ మా’ నిర్వహించే ‘నీ తోనే’ అనే డాన్స్ షోలో ఆమె కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘భాను ఈజ్ బ్యాక్’ అంటూ ‘స్టార్ మా’ వారు వదిలిన వీడియో బిట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ కార్యక్రమంలో ఉదయభాను చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.