పద్మావత్‌కు యోగి గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్‌’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ ఆందోళన నేపథ్యంలో సినిమా విడుదలకు జాప్యం జరగగా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు సినిమా పేరు మార్చడంతో సెన్సార్ బోర్డు లైన్ క్లియర్ చేసింది.

ఈ నేపథ్యంలో పద్మావత్ సినిమా రిలీజ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫిల్మ్‌ను వివాదాల మధ్య ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాలు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌పై నిషేధం విధించాయి. అయితే అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం మాత్రం పద్మావత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. భన్సాలీ తీసిన ఈ సినిమాలో దీపిక, రణ్‌వీర్ నటిస్తున్నారు.

UP CM Yogi Adityanath Green signals Padmavath

సినీ నిర్మాతలు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను సమీక్షించినట్లు సెన్సార్ బోర్డు పేర్కొనగా కేంద్ర సెన్సార్‌ బోర్డు ఈ సినిమా విడుదలకు అంగీకరించినా.. ఇందుకు తాము అంగీకరించబోమని రాజస్థాన్‌ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు అంగీకరించబోమని రాజస్థాన్‌ ప్రకటించింది.